పల్లవి: వందనం వందనం జై జ్ఞాన ధాత్రీ వందనం
జై ఏ.యం.ఏ. యల్. కళాశాల నీకు వందనం.
ఎందరో వర్తక సంఘ ప్రముఖుల త్యాగ ఫలమే
ఈ నందనవనం. "వందనం"
చరణం: సుందర సువిశాలమైన సౌధాలే నీ కాయం
వందల వేల విద్యార్థుల జ్ఞాన భిక్షయే నీ ధ్యేయం
జనతా గురు మమతా ఝరి కంకితమే నీ హృదయం
అనకాపల్లి ఘన కీర్తికి కడలందిన ఆశయం. "వందనం"
చరణం: 1953లో లింగమూర్తి గారి సారధ్యంలో
వెలసిన వర్తక ప్రపంచ కీర్తి నీకు వందనం
విద్యా వైభవ స్ఫూర్తి ఎందరో విద్యార్థుల విజయ ఖ్యాతి
రెండవ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ గా పేరు తెచ్చుకున్న
ఏ.యం.ఏ. ఎల్ కళాశాల నీకు వందనం. "వందనం"
చరణం: ఉత్తమ గురు శిష్యాంచిత శుక పిక ఫల రసాల
ఎన్.సి.సి, నేవి, ఆర్మీ, ఎన్.ఎస్.ఎస్. నూతన డిఫెన్స్ అకాడమీ
సస్యశ్యామలమైన పాడి పంటల చదువుకి నెలవు ఈ కొలువు
మున్నగు విద్దెల గద్దెగ అక్షర జ్యోతి....మురిపించే కళా జ్యోతి
ఏ.యం.ఏ. యల్. కళాశాల నీ..కు వందనం... "వందనం"
శ్రీమతిపి.వి.ఎస్.జ్యోతి